నువ్వు ఒక్క కేసు పెడితే.. నేను పది కేసులు పెడతా: కేసీఆర్‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

  • వైసీపీ ఓటమిని కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తా
  • హైదరాబాద్‌లో కూర్చుని జగన్ ఏపీ రాజకీయాలు చేస్తున్నారు
  • మీలా మేం ప్రధానికి ఊడిగం చేయబోం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం రాత్రి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి కేసీఆర్‌కు ఆ ఓటమిని రిటర్న్ గిఫ్ట్‌గా పంపిస్తానని అన్నారు. కేసీఆర్ ఒక్క కేసు పెడితే తాను పది కేసులు పెట్టగలనని హెచ్చరించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పంచన చేరి ఏపీపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. మీలా ప్రధానికి ఊడిగం చేయడానికి తాము సిద్ధంగా లేమన్న చంద్రబాబు.. తాము పోలవరం కట్టుకుంటుంటే కేసీఆర్ తెగ బాధపడిపోతున్నారని అన్నారు. వారికొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మీరు కాళేశ్వరం కడుతుంటే తామేమైనా బాధపడ్డామా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
KCR
Andhra Pradesh
Polavaram

More Telugu News